![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -176 లో.. కావ్య తన పుట్టింటికి వెళ్ళకూడదని, కావ్య వచ్చేముందు నూనె పోసిన వీడియోని రాజ్ కి చూపిస్తుంది. ఈ వీడియో బయటకు చూపించకుండా ఉండాలంటే.. ఏం చెయ్యాలని కావ్యని రాజ్ అడుగుతాడు. టైం వచ్చినపుడు చెప్తానని కావ్య అనేసి వెళ్ళిపోతుంది. అంటే అవసరం ఉన్నపుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందా అని రాజ్ అనుకుంటాడు.
మరొకవైపు అనామిక అడ్రెస్ వెతుక్కుంటూ.. అప్పు, కళ్యాణ్ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వస్తారు. ఇదేంటి అనామిక అడ్రెస్ ఇది చూపిస్తుందంటూ లోపలికి వెళ్తారు. లోపల ఉన్న డాక్టర్ కళ్యాణ్ ని చూసి తలతిక్కగా మాట్లాడి అనామిక ఇచ్చిన లెటర్ ని ఇస్తాడు. అందులో.. "నా లెటర్ వచ్చినట్లు, నా ఫోన్ నెంబర్ వచ్చేలా మీరే తెలుసుకోవాలి" అని అనామిక రాసిన లెటర్ లో ఉంటుంది. అయితే నేను ఇప్పుడు మళ్ళీ ఒక కవిత రాయాలన్నమాట అని కళ్యాణ్ అనుకుంటాడు. మరొకవైపు కావ్య తన పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అయి కిందకి వచ్చి సీతారామయ్య, ఇందిరాదేవీల ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత ఫోన్ లో ఆటో బుక్ చేసుకుంటుండగా.. సీతారామయ్య చూసి ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఆటో బుక్ చేస్తున్నానని కావ్య చెప్పగానే.. నువ్వు ఆటోలో వెళ్లడమేంటి? రాజ్ తీసుకెళ్తాడు అని చెప్తాడు. రాజ్.. నువ్వు రోజు కావ్యని తన పుట్టింట్లో దింపి ఆఫీస్ కి వెళ్ళాలని సీతరామయ్య చెప్తాడు. దానికి రాజ్ సరేనని చెప్పి, కావ్యని తీసుకొని బయల్దేరతాడు. ఆ తర్వాత రాజ్, కావ్యల మధ్య ఎప్పుడు జరిగే టామ్ అండ్ జెర్రీ మాటల యుద్ధం జరుగుతుంది.
మరొకవైపు స్వప్న ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవడంతో తనకి ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిసి కోపంగా టెస్ట్ కిట్ ని విసిరేస్తుంది. స్వప్న తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పగానే తన ఫ్రెండ్ ఇంకా టైమ్ పడుతది వెయిట్ చెయ్యాలి. నువ్వు తప్పు చేసావ్.. నీకు ఇష్టం అయినప్పుడు అవ్వాలంటే కాదు వెయిట్ చెయ్యాలని స్వప్నకి తన ఫ్రెండ్ చెప్తుంది. ఆ తర్వాత కొంపదీసి నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే నా పరిస్థితి ఏంటని స్వప్న అనుకుంటుంది. అప్పుడే స్వప్న దగ్గరికి రాహుల్ వస్తాడు. విసిరేసిన టెస్ట్ కిట్ ని రాహుల్ చూడకుండా స్వప్న జాగ్రత్తపడుతుంది. మరొకవైపు కృష్ణమూర్తి ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకొని కనకానికి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |